హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటిన కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, డీఆర్వో దాసరి వేణుతో కలిసి గురువారం మొక్కలు నాటారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.