హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నూతన బోధన పద్ధతులను అమలు చేయండి'

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నూతన బోధన పద్ధతులను అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ నుంచి విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంచాలని అన్నారు.