హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా క్రీడా ఎంపికలకు షెడ్యూల్ విడుదల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2025-26 ఎస్‌జీఎఫ్‌ఐ క్రీడా ఎంపికలకు షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 3న పాల్వంచ మినీ స్టేడియం, విద్యుత్ కలాభారతి కేటీపీఎస్‌లో వివిధ క్రీడల్లో ఎంపికలు నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.