హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్‌ షాక్‌కు గురై యువకుడి దుర్మరణం

మెదక్‌ పట్టణంలోని జేఎన్‌ రోడ్డులో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రాఖీ దుకాణం ఏర్పాటు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌తో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం విద్యుత్‌ స్తంభం సర్వీస్‌ వైరు తెగిపడి షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో కొత్తల నరేష్‌ (19) విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. గురువారం మృతిచెందాడు.