BPT: కర్లపాలెం మండలం నర్రావారిపాలెంలో 5 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరమ్మతుల పేరిట గుంతలు తవ్వి వదిలేశారని, ఫోన్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడ్డారు. నీటి ఎద్దడి తక్షణమే తీర్చకపోతే ఖాళీ బిందెలతో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీరు ఇవ్వాలని డిమాండ్


