NZB: జిల్లా ఆత్యాపాత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ గ్రౌండ్‌లో అండర్-17 క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీవైఎస్‌ఓ పవన్ కుమార్, ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తేవాలని వారు సూచించారు.
తెలంగాణ
'అండర్-17 ఆత్యాపాత్య ఎంపికలు'


