హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యాపార దుకాణాల సముదాయం ప్రారంభం

GDWL: ఐజ పట్టణంలో వాల్మీకి బోయల అభివృద్ధికై వ్యాపార దుకాణ సముదాయాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మున్సిపల్ ఛైర్మన్ సురేష్ వ్యాపార దుకాణ సముదాయాలను నేడు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వాల్మీకి బోయ సోదరులు ఈ దుకాణ సముదాయాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.