హైదరాబాద్: 28°C
తెలంగాణ

కడుపునొప్పి తాళలేక వృద్ధురాలి ఆత్మహత్య

HNK: హసన్‌పర్తి మండలంలోని గంటూరుపల్లికి చెందిన సరోజన (80) కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఆమెను 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. ఘటనపై ఎలాంటి అనుమానాలు లేవని కుమారుడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ మహేందర్ తెలిపారు.