హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేపాల్ వెళ్లిన HYD వాసులు సేఫ్

HYD: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చాయి. HYD నుంచి నేపాల్ వెళ్లిన 31 మంది యాత్రికులు మానస సరోవరంలో చిక్కుకున్నారు. వారు కుటుంబ సభ్యులకు సురక్షితంగా ఉన్నామని సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వెళ్లిన యాత్రికులు సురక్షితంగా ఉన్నామని కొందరు సమాచారం ఇవ్వగా, మరికొందరి ఆచూకిపై స్పష్టత రావాల్సి ఉంది.