హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్నాకు బయలుదేరిన ఉద్యోగ ఉపాధ్యాయులు

NRPT: ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఎసీ ఆధ్వర్యంలో గురువారం హైద్రాబాద్‌లో నిర్వహించే ధర్నాకు మక్తల్ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులు భారీ ఎత్తున బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్ డీఏలతో పాటు పీఆర్‌సీని ప్రకటించాలని, సిపిఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.