SRDl కోహీర్ మండలంలోని సజ్జాపూర్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీచేర్యాగడి–సజ్జాపూర్ రహదారిపై చెరువు వద్ద ఆటోను డీసీఎం ఢీకొంది. అనంతరం అదుపుతప్పిన డీసీఎం ఆటోపై పడటంతో డ్రైవర్‌తో పాటు ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి


