హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొడిచేడులో ఓటరు జాబితాపై అవగాహన సమావేశం

BHNG: పొడిచేడు గ్రామంలో గురువారం ఉదయం 10 గంటలకు గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ జిట్ట సైదులు ఆధ్వర్యంలో ఓటు తప్పొప్పులపై సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఓటర్ల జాబితాను పరిశీలించి, ఓటు వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకునే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, రామ నరసయ్య, మత్స్యగిరి, నరసయ్య, బిఎల్‌వోలు పాల్గొన్నారు.