NLG: చిట్యాల మండలం సుంకేనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు రక్షాబంధన్ వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు. బాలికలు, బాలురకు రాఖీలు కట్టి సోదర భావాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు ప్రతీక అని, ప్రతి ఒక్కరూ పరస్పర ప్రేమాభిమానాలతో మెలగాలని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో హెచ్ఎం శాంతకుమారి పాల్గొన్నారు.
తెలంగాణ
పాఠశాలలో వెల్లువిరిసిన సోదర భావం!


