WNP: ఆత్మకూరు మండలం గుంటుపల్లి సమీపంలోని డీ-6 కాలువ వద్ద గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పొలం పనులకు వెళ్లిన రైతులు కాలువ నీటిలో కొట్టుకువచ్చిన శవాన్ని చూసి అధికారులకు సమాచారం అందించారు. మృతుడు ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు తెలపారు.
తెలంగాణ
కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం!


