NRML: గుంజాల బొజ్జుగూడ గ్రామంలో అమ్మానాన్నలు లేని అనాథ పిల్లలకు గ్రామస్థులు మానవతా దృక్పథంతో అండగా నిలిచారు. గ్రామస్థులంతా కలిసి పిల్లలకు అవసరమైన వంట సామగ్రిని అందజేశారు. వారి ఇతర అవసరాలు, ఖర్చుల కోసం రూ. 3,500 ఆర్థిక సాయం చేశారు. అనాథ పిల్లలకు తోడుగా నిలిచిన గ్రామస్తుల సేవా భావాన్ని పలువురు అభినందించారు.
తెలంగాణ
అనాథ పిల్లలకు గ్రామస్థుల అండ


