హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫిట్స్‌తో చిన్నారి మృతి..!

SRCL: వీర్నపల్లి మండలం బంజేరు గ్రామం బీరప్ప తండాలో విషాదం చోటుచేసుకుంది. బట్టు రమేశ్, రజిత దంపతుల కుమారుడు ఈశ్వర్ ప్రసాద్ (5)కు వేకువజామున ఫిట్స్ వచ్చింది. కుటుంబ సభ్యులు ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చిన్నారి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తమ్ముడిని కోల్పోయిన ఇద్దరు అక్కల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.