హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా స్వయంభు ఉత్సవాలు

PDPL: స్వయంభు శ్రీ ఆదివరాహ స్వామి ఆలయంలో బుధవారం జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.