హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డిచ్‌పల్లిలో ముగ్గురు దొంగ‌ల‌కు దేహ‌శుద్ధి

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లిలో ముగ్గురు దొంగలకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ కాయిల్స్ చోరీ చేస్తున్న ముగ్గురిని గ్రామస్తులు పట్టుకుని స్తంభాలకు కట్టేశారు. అనంతరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.