హైదరాబాద్: 28°C
తెలంగాణ

గట్టులో గుప్త నిధుల కోసం తవ్వకాలు

GDWL: గట్టు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల వెనుక ఉన్న గుట్టపై గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి క్షుద్రపూజలు చేసి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. మూడు నెలల్లోనే మూడు వేర్వేరు చోట్ల ఈ తవ్వకాలు సాగినా అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.