హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLA పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు!

JN: స్టేషన్ ఘన్‌పూర్ MLA కడియం శ్రీహరిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హుజురాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డికి శాసనసభ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరిపై చేసిన అనైతిక ప్రవర్తన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై ఈ భేటిలో కమిటీ విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న 11 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో భేటి అయి సమగ్ర విచారణ జరగనుంది.