హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరీశ్‌రావు రాకతో పాలిటెక్నిక్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు

WGL: శక్తి పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావు వస్తున్న నేపథ్యంలో కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కళాశాల ప్రధాన గేట్లకు తాళాలు వేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.