హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థలో ఎస్సీ కమ్యూనిటీ హాల్

SRPT: వేణుగోపాలపురంలో లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్వహణ లేక శిథిలావస్థకు చేరింది. తలుపులు, కిటికీలు ధ్వంసమై చెత్తాచెదారం పేరుకుపోయింది. వినియోగంలో లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి సామాజిక కార్యక్రమాలకు ఉపయోగపడేలా వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.