హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ తవ్వకాలు.. వాహనాలు సీజ్

వనపర్తి రూరల్ పరిధిలోని రాజనగరం శివారు కొండలయ్య గట్టు వద్ద అక్రమంగా గుట్టను తవ్వుతున్న ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఒక జేసీబీ, 12 ట్రాక్టర్లతో తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారంతో ఘటనాస్థలికి చేరిన పోలీసులు వాహనాలను పట్టుకున్నారు. ఎస్సై రిషికేష్ ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.