హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ మట్టి తవ్వకాలపై కఠిన చర్యలు

RR: ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా మట్టి తవ్వి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి, తహసీల్దార్ సునీతారెడ్డి హెచ్చరించారు. సీతారాంపేట్‌లో అక్రమ తవ్వకాల సమాచారంతో దాడులు చేసి ఎక్స్ కవేటర్ సీజ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే వాహనాల సీజ్‌తో పాటు క్రిమినల్ కేసులు తప్పవని తెలిపారు.