హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

JN: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ సూచించారు. గుర్తుతెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని, OTP, పిన్, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లకు స్పందించకుండా జాగ్రత్త వహించాలని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.