BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ 8వ, వార్డులో గురువారం ఉదయం పారిశుధ్య పనులను, నీటి సరఫరా లీకేజీ మరమ్మతు పనులను మున్సిపాలిటీ కమిషనర్ జి. నర్సయ్య పరిశీలించారు. పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని, నీటి లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
తెలంగాణ
మున్సిపాలిటీలో పారిశుధ్యం పనుల పరిశీలన


