హైదరాబాద్: 28°C
క్రైమ్

రోడ్డు ప్రమాదం.. విద్యార్థులు మృతి

TG: హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులపైకి వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు బీటెక్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు హర్షవర్ధన్, శివరాజ్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.