JGL: పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన వైకుంఠధామానికి బుధవారం విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు సర్పంచ్ రజిత తెలిపారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ నుంచి గ్రామ సమీపంలోని వైకుంఠధామం వరకు నూతనంగా విద్యుత్ లైన్ వేసి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఉన్నారు.
తెలంగాణ
నూతనంగా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు


