హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్రిడ్జి కింద నిలిచిన నీరు.. రాకపోకలకు ఇబ్బందులు

KMR: బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని అండర్ బై పాస్ బ్రిడ్జి కింద గురువారం వర్షపు నీరు నిలిచి పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటోందని గ్రామస్తులు తెలిపారు. సమస్యను జీఎంఆర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.