హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాగుటూరు తండాలో అపరిశుభ్రంగా నీటి ట్యాంక్

ప్రకాశం: అర్థవీడు మండలం మాగుటూరు తండాలోని నీటి ట్యాంక్ అపరిశుభ్రంగా మారడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్‌ను శుభ్రపరిచి, క్లోరినేషన్ చేసి ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే తండాలో సైడ్ కాలువలు శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు నిలిచి దుర్వాసన వ్యాపిస్తోందన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.