హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్దిపేట అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

సిద్దిపేట అభివృద్ధిపై క్యాంపు కార్యాలయానికి చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు చేసిన సవాల్పై బీఆర్ఎస్, యువజన, విద్యార్థి నాయకులు స్పందించారు. ఏ మంత్రి వస్తారో రండి.. రంగనాయకసాగర్, శిల్పారామం, వెయ్యి పడకల ఆసుపత్రి వద్దకు వెళ్లి అభివృద్ధిపై చర్చిద్దామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు సాయి ప్రేమ్, రెడ్డి యాదగిరి, ఇరుగంటి రమేష్, అప్పల శేఖర్ విమర్శలు చేశారు.