హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయాన్ని చుట్టుముట్టిన గోదావరి

E.G: గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గండిపోశమ్మ ఆలయం వద్ద జలకళ సంతరించుకుంది. ఆలయం మునిగిపోగా గోపురంపై కలశం మాత్రం కనిపిస్తోంది. సమీపంలోని దుకాణాలన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. నీటి మట్టం పెరగడంతో పోశమ్మగండి నుంచి నాగలపల్లి వరకు R&B రహదారిని వరద ముంచెత్తింది. పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్లను నిర్వాహకులు ఒడ్డుకు చేర్చారు.