హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

GDWL: పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గద్వాలలో పని ముగించుకుని బైక్‌పై కర్నూలుకు తిరుగుపయనమైన హరి (44), సుబ్రహ్మణ్యాలను వెనుక నుంచి ఓ వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ హరి ప్రాణాలు కోల్పోయాడు.