హైదరాబాద్: 28°C
తెలంగాణ

బూటారం–రొయ్యూరు రహదారి పై రోడ్డుపై బుంగ..

MLG: ఏటూరునాగారం మండల కేంద్రం బూటారం మీదుగా రొయ్యూరు వెళ్లే రహదారిపై బుంగ ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు ప్రవహించడంతో రోడ్డు కోతకు గురై పెద్ద గొయ్యి ఏర్పడింది. ప్రమాదాన్ని గుర్తించేందుకు రైతులు అక్కడ కర్రను ఏర్పాటు చేశారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.