హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్ల చివరి బిల్లుల మంజూరు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలో ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లు రూ. లక్ష మంజూరైందని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య బుధవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.185 కోట్లు విడుదల చేసిందన్నారు. మండలంలో 643 ఇళ్లు మంజూరైతే 101 రద్దయ్యాయని, 290 ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. మార్చి 31 నాటికి గృహప్రవేశం చేసిన వారికి మంజూరయ్యాయన్నారు.