హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి రూ. లక్ష LOC మంజూరు

JN: బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేటకు చెందిన జూల లక్ష్మయ్య వేరికోసిల్ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్‌కుమార్ గౌడ్ స్పందించారు. వైద్య చికిత్స కోసం రూ. లక్ష ఎల్‌వోసీ మంజూరు చేయించి, బుధవారం బాధిత కుటుంబ సభ్యులకు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సహకరించిన నాయకులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.