హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోలీసులపై చర్యలు తీసుకోవాలి'

KNR: జమ్మికుంట గాంధీ చౌరస్తాలో బుధవారం రాత్రి స్వీట్‌ షాప్‌లో ధర విషయంలో యజమాని, కస్టమర్‌ రాజు మధ్య వాగ్వాదం జరిగింది. యజమాని 112కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు తనను దుర్భాషలాడుతూ కొట్టి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లారని రాజు ఆరోపించాడు. తనపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై ఆందోళనకు దిగాడు.