హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదివరాహ స్వామిని దర్శించుకున్న ఏపీపీ కుమార్

PDPL: మంథని కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అర్థ కుమార్, హాసిని దంపతులు బుధవారం కమాన్‌పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివరాహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పండితులు వారికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, తదితరులు పాల్గొన్నారు.