హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువకుడి అనుమానాస్పద మృతి!

MLG: వరంగల్ దేశాయిపేటకు చెందిన చేరాల నాగసుకృత్ (22) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నేహితులతో కలిసి రామప్ప ఆలయ దర్శనానికి వెళ్లి, తిరుగు ప్రయాణంలో ములుగులోని ఓ హోటల్ వద్ద భోజనం చేసిన అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు.