హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

KNR: ఈ నెల 27న నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్ కోరారు. సీపీఎస్ విధానాన్ని తొలగించి పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలని అన్నారు. రెండో పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల చెల్లింపుతో పాటు ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.