హైదరాబాద్: 28°C
వ్యాపారం

రూ.1.72 లక్షల కోట్లు చెల్లించేందుకు మెటా సిద్ధం

చిన్నారులపై సోషల్ మీడియా దుష్ప్రభావల కేసులో అమెరికాతో మెటా సంస్థ రాజీకి సిద్ధమైంది. 18 బిలియన్ డాలర్ల(రూ.1.7 లక్షల కోట్లు) పరిహారాన్ని అమెరికా రాష్ట్రాలకు చెల్లించేందుకు అంగీకారం తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. రాబోయే పదేళ్లలో విడతల వారీగా మెటా ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు పేర్కొంది.