హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామన్నపాలెం గేట్ వద్ద రోడ్డు ప్రమాదం

నెల్లూరు నుంచి రాజుపాలెం వైపు వెళ్తున్న కారు రామన్నపాలెం గేట్ వద్ద బుధవారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రాజుపాలెం దిన్నెకు చెందిన గంగపట్నం శ్రీనివాసులు (24) గాయపడ్డారు. ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అలీ, పైలెట్ నాగరాజు ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన శ్రీనివాసులను అపోలో ఆసుపత్రికి తరలించారు.