హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌పై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఫైర్

HYD: 22ఏ నిషేధిత భూముల జాబితాపై కుట్ర చేసింది ఎవరో తేల్చాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటపెట్టాలన్నారు. నిషేధిత భూముల అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించడం లేదు? అని ఏలేటి ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.