PPM: చేతివృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న ధర్నాలను జయప్రదం చేయాలని సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సింహాద్రి దుర్గారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చేతివృత్తిదారుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, రూ.5 లక్షల రుణానికి 50 శాతం సబ్సిడీ, 50 ఏళ్లు దాటిన వారికి రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ధర్నాలను జయప్రదం చేయాలి'


