హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొల్లారంలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ

SRD: బొల్లారం డివిజన్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శాంతి ర్యాలీలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వీ. చంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త సర్వమానవాళి శ్రేయస్సు కోసం కృషి చేసిన కారణజన్ముడని కొనియాడుతూ.. ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు.