హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసిన ఎమ్మెల్యే

KMM: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్‌ తెల్లం వెంకటరావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి నిధులు, అసంపూర్తిగా ఉన్న ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.