హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఆది

JGL: కథలాపూర్ మండలం సిరికొండలో రూ.50 లక్షల CGF నిధులతో నిర్మించనున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం భూమిపూజ చేశారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తుందని, భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.