MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రావణమాసం ఆదివారం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి మహిళలు, భక్తులు దేవాలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పలు జంటలు యజ్ఞశాలలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాయి.
తెలంగాణ
గూడెం దేవాలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు


