హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు మృతి

కృష్ణా: తెలంగాణ కోదాడ మండలం ద్వారకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరో మహిళను విజయవాడకు చెందిన కొండూరు భావన వర్షగా గుర్తించారు. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఇప్పటివరకు ఐదుగురి వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వాసుల మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మరో మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.