BDK: చండ్రుగొండ మండలంలో మాజీ MLA మెచ్చ నాగేశ్వరరావు ఇవాళ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మద్దుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన BRS పార్టీ దిమ్మెను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. కెసిఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రి చేసే వరకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు.
తెలంగాణ
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి: మాజీ MLA


